అవినీతి సూచీలో మరింత దిగజారిన పాక్‌, భారత్‌ స్థానం ఏంటంటే.. | Sakshi
Sakshi News home page

Pakistan-Corruption Perception Index 2022: అవినీతి సూచీలో మరింత దిగజారిన పాక్‌, భారత్‌ స్థానం ఏంటంటే..

Published Wed, Jan 26 2022 4:16 AM

Pakistan Slips Corruption Perceptions Index Ranks 140 - Sakshi

ఇస్లామాబాద్‌: ప్రపంచ అవినీతి సూచికలో పాకిస్తాన్‌ మరింత దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. బెర్లిన్‌కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ 180 దేశాలతో కూడిన ఈ జాబితాను విడుదల చేస్తుంది. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది. 2021 సీపీఐ (కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌) జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– శూన్య అవినీతి)రేంజ్‌లో మార్కులు ఇచ్చారు. ఈ జాబితాలో 28 సీపీఐతో పాక్‌ 140వ స్థానంలో నిలిచింది.

భారత్‌ 40సీపీఐతో 85వ స్థానంలో, బంగ్లాదేశ్‌ 147వ స్థానంలో నిలిచాయి. పాక్‌లో రూల్‌ ఆఫ్‌ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషిం చింది. జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్‌లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్‌ ఉన్నాయి. భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్‌ ఉన్నాయి. ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement