పాకిస్తాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.330

Pakistan caretaker government announces another hike in fuel prices, petrol reaches over Rs 330 per litre  - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలను మరోసారి పెంచింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 పెంచుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. తాజా పెంపుతో లీటర్‌ పెట్రోల్, హైస్పీడ్‌ డీజిల్‌ ధర గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రూ.330కు చేరుకుంది.

ద్రవ్యోల్బణం 27.4 శాతానికి చేరడంతో ఈ చర్య అనివార్యమయినట్లు ప్రభుత్వం చెబుతోంది. శనివారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 296.41 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీన కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.14 చొప్పున పెంచింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top