నవాజ్‌ షరీఫ్‌కు బిన్‌ లాడెన్‌ ఆర్థిక సాయం

Osama Bin Laden funded Nawaz Sharif - Sakshi

ఇస్లామాబాద్‌: అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు ఆర్థిక సాయం అందిస్తుండేవాడని అమెరికాలో పాక్‌ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్‌ తాజాగా బయటపెట్టారు. ఆమె గతంలో నవాజ్‌ షరీఫ్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ‘‘అవును, లాడెన్‌ ఒక విషయంలో నవాజ్‌ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్‌ షరీఫ్‌కు లాడెన్‌ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడు’’ అని సయీద్‌ అబిదా హుస్సేన్‌ ప్రైవేట్‌ న్యూస్‌ చానెల్‌ జీయో టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బిన్‌ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్‌ బృందం 2011 మేలో పాకిస్తాన్‌ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top