కొత్త ఏడాదికి అణ్వస్త్రాల పెంపు ప్రకటనతో కిమ్‌ స్వాగతం

North ​Korea Kim Jong Un Calls For Increase In Nuclear Arsenal - Sakshi

ప్యొంగ్యాంగ్: మిరుమిట్లు గొలిపే బాణసంచా, విద్యుత్తు దీపాల కాంతులతో ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం తన రూటే సపరేట్‌ అని మరోమారు చాటుకున్నారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్‌ మిసైల్‌ను ప్రయోగించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. 

కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం జరిగిన అధికార పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు కిమ్‌. దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని తెలిపారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలపై విమర్శలు గుప్పించారు. 

మరోవైపు.. వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త తరం ఖండాంతర బాలిస్టిక్‌ మిసైల్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే.. తొలి స్పై శాటిలైట్‌ను త్వరలోనే ప్రయోగించే యోచనలో కిమ్‌ ఇన్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: కాబూల్‌ ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top