అమెరికా చేరిన కొత్త కరోనా..

New Coronavirus Variant hits US Without Travel History - Sakshi

ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేనప్పటికి వైరస్‌ బారిన పడ్డ యువకుడు

వాషింగ్టన్‌: ఇప్పుడిప్పుడే కోవిడ్‌ భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని కొత్త కరోనా వైరస్‌ మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. బ్రిటన్‌లో మొదలైన ఈ కొత్త కరోనా వ్యాప్తి తాజాగా అగ్రరాజ్యానికి కూడా చేరింది. ఇప్పటికే కోవిడ్‌తో కకావికలమైన అమెరికాను కొత్త కరోనా వైరస్‌ మరింత భయపెట్టనుంది. కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ జేర్డ్‌ పొలిస్‌ తెలిపారు. ఈ కొత్త వైరస్‌ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన కల్గిస్తుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎలా వైరస్‌ బారిన పడ్డాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇక బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఇక బ్రిటన్‌లో కొత్త వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి అమెరికా ఆ దేశం నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్టు చూపించాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (కొత్త వైరస్‌: ఆ లక్షణాలు కనిపించడం లేదు )

ఈ వైరస్‌కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్‌ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్‌ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇక మనదేశంలోను కొత్త కరోనా కేసులు 20కి చేరుకున్నాయి. నిన్న ఆరు కేసులు వెలుగు చూడగా.. తాజాగా నేడు 14 కేసులు నమోదయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top