అవసరమైతే మళ్లీ దాడులు | Netanyahu says Israel will attack Iran again if needed | Sakshi
Sakshi News home page

అవసరమైతే మళ్లీ దాడులు

Jul 2 2026 5:31 AM | Updated on Jul 2 2026 5:31 AM

Netanyahu says Israel will attack Iran again if needed

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరిక

జెరూసలేం: అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి చేయడానికి ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించారు. ఇరాన్‌ అణ్వాయుధాలపై దృష్టి కేంద్రీకరించకుండా ఆపడానికి ఇజ్రాయెల్‌ స్వతంత్రంగా ప్రయతి్నస్తుందని, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ మరో సైనిక చర్య జరిగే అవకాశం ఉందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ భద్రతపై స్పష్టతరాని పక్షంలో, ఇరాన్‌ అణు బాంబు నుంచి తమను తాము కాపాడుకోవడానికి అవసరమైతే మూడోసారీ దాడి చేస్తామన్నారు.  

భద్రతపై ఇజ్రాయెల్‌ ఆందోళన 
దశలవారీగా ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియను అనుసరించడానికి అమెరికా, ఇరాన్‌ సూత్రప్రాయంగా అంగీకరించాయి. సైనిక చర్యను నిలిపివేయడం, హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల ఉపశమనంపై చర్చలు జరపడం, ఇరాన్‌ అణు కార్యకలాపాలను పరిష్కరించేందుకు యంత్రాంగాలను ఏర్పాటు చేయడం వంటి హామీలు ఈ ముసాయిదా ఒప్పంద పత్రంలో ఉన్నాయి. తాము అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్‌ కూడా పునరుద్ఘాటించింది. అయితే, తమ దృష్టిలో ఇరాన్‌ సైనిక లేదా అణు సామర్థ్యాలను యథాతథంగా ఉంచే ఏ ఒప్పందానికైనా తాము కట్టుబడి ఉండబోమని ఇజ్రాయెల్‌ పదేపదే సంకేతాలు ఇస్తోంది.

సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. దాడులు ఇజ్రాయెల్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేస్తాయని, కొనసాగుతున్న చర్చలను దెబ్బతీస్తాయని ట్రంప్‌ నెతన్యాహును హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, నెతన్యాహు మంగళవారం దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను సందర్శించారు. భద్రతా ఒప్పందాలు కుదిరినప్పటికీ ఇజ్రాయెల్‌ బలగాలు అక్కడే ఉంటాయని చెప్పారు. హెజ్బొల్లా బెదిరిస్తున్నంత కాలం, ముప్పు తొలగిపోయే వరకు తాము దక్షిణ లెబనాన్‌ను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement