నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి

Nepal: 32 Deceased, Several Injured In Bus Accident Mugu District - Sakshi

కఠ్మాండూ: నేపాల్‌లో మంగళవారం బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌గంజ్‌ నుంచి గమ్‌గాధి వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పినాఝరి నదిలో ప్రమాదవశాత్తు పడింది. ఛాయానాథ్‌ రారా మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటనలో 32 మంది చనిపోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు మై రిపబ్లికా అనే వెబ్‌సైట్‌ తెలిపింది. ప్రమాద బాధితులంతా విజయదశమి పండక్కి సొంతూళ్లకు వెళ్తున్న వారేనని పేర్కొంది.  

చదవండి: ('అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తా: కిమ్‌ ప్రతిజ్ఞ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top