భారీ వర్షాలతో బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి

A Mudslide Unleashed By Torrential Rain Buried A Bus In Colombia - Sakshi

బొగోటా: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సును పూర్తిగా ముంచేసింది బురద. మరో రెండు వాహనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. 

రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. భారీగా బురద ఉప్పొంగటంతో రహదారి రెండుగా చీలిపోయింది. భారీగా ట్రీఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రెండు మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన బస్సులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బురద కమ్మేయడంతో ఓ కారులోని ఆరుగురు, ద్విచక్రవాహనంపై ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. 

సుమారు 70 మంది రెస్క్యూ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ప్రభుత్వ తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మనిషి మెదడులో చిప్‌.. న్యూరాలింక్‌ ప్రయోగాలపై ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top