breaking news
Colombia mudslide
-
బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి
బొగోటా: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అమెరికాలోని కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సును పూర్తిగా ముంచేసింది బురద. మరో రెండు వాహనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రిసరాల్డా జిల్లాలోని ప్లూబో రికో నగరంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. భారీగా బురద ఉప్పొంగటంతో రహదారి రెండుగా చీలిపోయింది. భారీగా ట్రీఫిక్ జామ్ ఏర్పడింది. రెండు మీటర్ల లోతులో బురదలో కూరుకుపోయిన బస్సులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బురద కమ్మేయడంతో ఓ కారులోని ఆరుగురు, ద్విచక్రవాహనంపై ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. సుమారు 70 మంది రెస్క్యూ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ప్రభుత్వ తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది.’ అని పేర్కొన్నారు. A #landslide engulfed a #bus in #Colombia on Sunday afternoon, leaving at least 34 people dead and several injured. The bus and 3 other vehicles were traveling on the highway near Pueblo Rico, #Risaralda when they were surprised by the #avalanche. #viralvdoz pic.twitter.com/ePahStfzo1 — ViralVdoz (@viralvdoz) December 6, 2022 ఇదీ చదవండి: మనిషి మెదడులో చిప్.. న్యూరాలింక్ ప్రయోగాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ -
248కి చేరిన కొలంబియా మృతులు
బోగోటా: కొలంబియాలో భారీ వర్షాలతో మట్టి, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 248 కి చేరింది. భారీ వర్షాలకు పులమయో ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడి వందలాది మంది గల్లంతవడంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు 248 మంది మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొండచరియల కింద ఇంకా 400 మందికి పైగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.