కొలంబియాలో భారీ వర్షాలతో మట్టి, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 248 కి చేరింది.
248కి చేరిన కొలంబియా మృతులు
Apr 3 2017 11:06 AM | Updated on Sep 5 2017 7:51 AM
బోగోటా: కొలంబియాలో భారీ వర్షాలతో మట్టి, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 248 కి చేరింది. భారీ వర్షాలకు పులమయో ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడి వందలాది మంది గల్లంతవడంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు 248 మంది మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొండచరియల కింద ఇంకా 400 మందికి పైగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Advertisement
Advertisement