వీడియో: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట.. | MPs Fight Each Other In G7 Summit In Italy Parliament, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

MPs Fight In Italy: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట..

Published Fri, Jun 14 2024 7:55 AM | Last Updated on Fri, Jun 14 2024 9:17 AM

MPs Fight Each Other In Italy Parliament Video Viral

రోమ్‌: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్‌లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్‌లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్‌ చైర్‌లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

 

 

కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement