యూజర్స్‌ అత్యధికంగా డిలీట్‌ చేసిన యాప్‌ ఏది? | Sakshi
Sakshi News home page

Year Ender 2023: యూజర్స్‌ అత్యధికంగా డిలీట్‌ చేసిన యాప్‌ ఏది?

Published Tue, Dec 26 2023 7:01 AM

Most Deleted App of 2023 - Sakshi

2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్‌ చేసిన సోషల్ మీడియా యాప్‌ల జాబితా కూడా బయటకు వచ్చింది. 

సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్‌ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 

2023లో యూజర్స్‌ అత్యధికంగా డిలీట్‌  చేసిన యాప్‌ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్‌జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం...  అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్‌ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్‌ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. 

ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్‌ ఇంటర్నెట్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్‌ చేశారు.
 
అత్యధికంగా డిలీట్‌ చేసిన యాప్‌ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్‌చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్‌ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌), టెలీగ్రామ్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌,యూట్యూబ్‌, వాట్సాప్‌, విచాట్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్‌బుక్ యాప్‌ను తొలగించారు. వాట్సాప్‌ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. 
ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు!

Advertisement
 
Advertisement