అవును. నిజమే. ఇప్పుడు పూర్తిగా పొడిబారి కనిపిస్తున్న అంగారక గ్రహం ఒకప్పుడు జల కళతో మురిసిపోయేదట. దానిమీద కూడా గంగ వంటి జీవ నదులు పొంగి పారేవట. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 అతి పెద్ద నదీ వ్యవస్థలతో ఆ గ్రహం కళకళలాడిపోయేదట. ఇందుకు సంబంధించి పక్కా రుజువులు తాజాగా వెలుగు చూడటం విశేషం...!
అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ బృందం అంగారకునిపై ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. అక్కడి నీటిపారుదల వ్యవస్థలపై తొలిసారిగా జరిగిన ఈ సమగ్ర పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం 16 భారీ నదీ వ్యవస్థలు ఒకనాడు గురు గ్రహంపై విలసిల్లినట్టు తేలింది. ప్రాంతాలన్నిటా ఒకప్పుడు జీవం ఉనికి ఉండేదనేందుకు ఇది ఒక ప్రబల తార్కాణమని అధ్యయన బృందం చెబుతోంది.
జల కళ ఇలా...
గురు గ్రహంపై జలావిర్భావం గురించి పలు ఆసక్తికర అంశాలు పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట అంతూ పొంతూ లేని రీతిలో కురిసిన వర్ష ధారల ధాటికి అక్కడ లోయలు, భారీ నదీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయట. అవి ప్రస్తుతం భూమిపై తిరుగులేని జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా విలసిల్లుతున్న అమెజాన్ వంటి నదీ వ్యవస్థలకు ఏ మాత్రమూ తీసిపోవని అధ్యయన బృందం అంటోంది.
ఆ లెక్కన ఒకనాడు గురు గ్రహమూ చక్కని జల కళతో విలసిల్లే ఉంటుందని చెబుతోంది. అంతేకాదు, ఆ భారీ జల రాశి ఏకంగా మహా సముద్రాలుగా కూడా రూపు దాలి్చందట! ‘గురు గ్రహంపై నదులు ఉండేవన్నది చాలాకాలంగా మనకు తెలిసిన సంగతే. అయితే బతికి సంబంధించి ఇంత స్పష్టతతో కూడిన వివరాలు వెలుగులోకి రావడం మాత్రం ఇదే తొలిసారి‘ అని అధ్యయన బృంద సారథి తిమోతీ ఎ.గౌడ్జ్ హర్షం వెలిబుచ్చారు.
నదులు, లోయలు, అగాథాలు, పర్వతాలు తదితరాల చిహా్నలతో కూడిన 19 వ్యవస్థలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 16 ఏకంగా లక్ష చదరపు కిలోమీటర్లకు మించిన విస్తీర్ణంతో కూడుకుని ఉండటం విశేషం. ‘‘అయితే భూమిపై ఉన్న జల వ్యవస్థలతో పోలిస్తే ఇవి మరీ పెద్దవే కావు. ఉదాహరణగా చెప్పాలంటే ఒక్క అమెజాన్ నదీ వ్యవస్థ విస్తీర్ణమే ఏకంగా 62 లక్షల చదరపు కి.మి. ఉంటుంది’’అని తిమోతీ వివరించారు.
అమూల్య వివరాలు
సమీప భవిష్యత్తులో అంగారక యాత్రలకు నాసా తదితర అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతుండటం తెలిసిందే. అందుకు ఈ అరుణ గ్రహం మీద ఏ ప్రాంతాలను ఎంచుకోవాలో తేల్చుకునేందుకు ఈ పరిశోధన చక్కని వీలు కలి్పస్తుందని సైంటిస్టులు ఉంటున్నారు. అంతేగాక అక్కడ ఏయే ప్రాంతాలు ఆవాసయోగ్యమో కూడా కచి్చతమైన అంచనాకు వచ్చేందుకు తోడ్పడుతుందని హర్షం వెలిబుచ్చుతున్నారు. పరిశోధన పూర్తి వివరాలు పీఎన్‌ఏఎస్‌లో ప్రచురితమయ్యాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


