breaking news
University of Texas scientists
-
అంగారకునిపైనా... ఒక గంగ!
అవును. నిజమే. ఇప్పుడు పూర్తిగా పొడిబారి కనిపిస్తున్న అంగారక గ్రహం ఒకప్పుడు జల కళతో మురిసిపోయేదట. దానిమీద కూడా గంగ వంటి జీవ నదులు పొంగి పారేవట. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 అతి పెద్ద నదీ వ్యవస్థలతో ఆ గ్రహం కళకళలాడిపోయేదట. ఇందుకు సంబంధించి పక్కా రుజువులు తాజాగా వెలుగు చూడటం విశేషం...!అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ బృందం అంగారకునిపై ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. అక్కడి నీటిపారుదల వ్యవస్థలపై తొలిసారిగా జరిగిన ఈ సమగ్ర పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం 16 భారీ నదీ వ్యవస్థలు ఒకనాడు గురు గ్రహంపై విలసిల్లినట్టు తేలింది. ప్రాంతాలన్నిటా ఒకప్పుడు జీవం ఉనికి ఉండేదనేందుకు ఇది ఒక ప్రబల తార్కాణమని అధ్యయన బృందం చెబుతోంది.జల కళ ఇలా... గురు గ్రహంపై జలావిర్భావం గురించి పలు ఆసక్తికర అంశాలు పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట అంతూ పొంతూ లేని రీతిలో కురిసిన వర్ష ధారల ధాటికి అక్కడ లోయలు, భారీ నదీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయట. అవి ప్రస్తుతం భూమిపై తిరుగులేని జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా విలసిల్లుతున్న అమెజాన్ వంటి నదీ వ్యవస్థలకు ఏ మాత్రమూ తీసిపోవని అధ్యయన బృందం అంటోంది. ఆ లెక్కన ఒకనాడు గురు గ్రహమూ చక్కని జల కళతో విలసిల్లే ఉంటుందని చెబుతోంది. అంతేకాదు, ఆ భారీ జల రాశి ఏకంగా మహా సముద్రాలుగా కూడా రూపు దాలి్చందట! ‘గురు గ్రహంపై నదులు ఉండేవన్నది చాలాకాలంగా మనకు తెలిసిన సంగతే. అయితే బతికి సంబంధించి ఇంత స్పష్టతతో కూడిన వివరాలు వెలుగులోకి రావడం మాత్రం ఇదే తొలిసారి‘ అని అధ్యయన బృంద సారథి తిమోతీ ఎ.గౌడ్జ్ హర్షం వెలిబుచ్చారు. నదులు, లోయలు, అగాథాలు, పర్వతాలు తదితరాల చిహా్నలతో కూడిన 19 వ్యవస్థలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 16 ఏకంగా లక్ష చదరపు కిలోమీటర్లకు మించిన విస్తీర్ణంతో కూడుకుని ఉండటం విశేషం. ‘‘అయితే భూమిపై ఉన్న జల వ్యవస్థలతో పోలిస్తే ఇవి మరీ పెద్దవే కావు. ఉదాహరణగా చెప్పాలంటే ఒక్క అమెజాన్ నదీ వ్యవస్థ విస్తీర్ణమే ఏకంగా 62 లక్షల చదరపు కి.మి. ఉంటుంది’’అని తిమోతీ వివరించారు.అమూల్య వివరాలు సమీప భవిష్యత్తులో అంగారక యాత్రలకు నాసా తదితర అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతుండటం తెలిసిందే. అందుకు ఈ అరుణ గ్రహం మీద ఏ ప్రాంతాలను ఎంచుకోవాలో తేల్చుకునేందుకు ఈ పరిశోధన చక్కని వీలు కలి్పస్తుందని సైంటిస్టులు ఉంటున్నారు. అంతేగాక అక్కడ ఏయే ప్రాంతాలు ఆవాసయోగ్యమో కూడా కచి్చతమైన అంచనాకు వచ్చేందుకు తోడ్పడుతుందని హర్షం వెలిబుచ్చుతున్నారు. పరిశోధన పూర్తి వివరాలు పీఎన్ఏఎస్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనసు మాట వినే చక్రాల కుర్చీ!
వాషింగ్టన్: దివ్యాంగులకు చక్కగా ఉపయోగపడే చక్రాల కుర్చీని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కుర్చీని కదిపేందుకు బటన్స్ నొక్కాల్సిన పనిలేదు. మనిషిలోని ఆలోచనలను బట్టి నడుచుకుంటుంది. అంటే మనస్సుతో∙కుర్చీని కంట్రోల్ చేయొచ్చు. కుర్చీలో కూర్చున్న తర్వాత కుడి వైపునకు మళ్లాలంటే రెండు చేతులను కుడి వైపునకు కదిలించినట్లు మనసులో ఊహించుకుంటే చాలు. ఎడమ వైపునకు వెళ్లాలంటే రెండు కాళ్లను అదే దిశలో కదిలించినట్లు ఊహించుకోవాలి. మెదడులోని సంకేతాలను వీల్ చైర్ కదలికలతో అనుసంధానించారు. ఇందుకోసం హెల్మెట్ (స్కల్ క్యాప్) లాంటిది ధరించాలి. ఇందులో 31 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెదడు అందించే సంకేతాలను పసిగడతాయి. చైర్ వెనుక ల్యాప్‌ట్యాప్ ఫిక్స్ చేసి ఉంటుంది. కృత్రిమ మేధ(ఏఐ)తో మెదడు సంకేతాలు కుర్చీ కదలికలుగా మారుతాయి. దివ్యాంగులు, నడవలేని బాధితులు చేయాల్సిందల్లా కుర్చీలో కూర్చొని కాళ్లు, చేతులు ఆడించినట్లు మనసులో ఊహించుకోవడమే. మనసు మాట వినే ఈ చక్రాల కుర్చీ 80 శాతం కచ్చితత్వంతో పని చేసినట్లు అధ్యయనంలో తేలింది. కుర్చీలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
ఎంఆర్ఐతోనే క్యాన్సర్ కణుతుల గుర్తింపు...
శరీరంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే చేయించుకునే ఎంఆర్ఐ పరీక్షలు ఇకపై క్యాన్సర్ కణుతుల గుర్తింపుకి కూడా ఉపయోగపడనున్నాయి. ఇదంతా యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్ సౌత్ వెస్టర్న్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. శరీరంలో కణుతులు ఏర్పడటం కొన్ని సందర్భాల్లో సహజం. అన్నీ క్యాన్సర్‌కు దారితీయవు. ఏది వ్యాధిగా మారుతుందో గుర్తించాలంటే.. ఆ కణజాలాన్ని బయటకు తీసి పరీక్షించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కత్తికి అందనిచోట్ల కూడా కణుతులు ఏర్పడటం కద్దు. ఈ నేపథ్యంలో టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కిడ్నీల్లో ఏర్పడే కణుతులపై పరిశోధనలు జరిపారు. సాధారణ ఎంఆర్ఐ పరీక్షలకే కొన్ని మార్పులు చేయడం ద్వారా కణితి ప్రమాదకరమైనదా? కాదా? అందులో ఉన్న పదార్థం ఎలాంటిది? వంటి అన్ని అంశాలను విశ్లేషించగలిగారు. బోలెడన్ని ఎంఆర్ఐ చిత్రాల ఆధారంగా నిర్దిష్ట ప్రాంతలో ఉండే కణితి లోపల అతి సూక్ష్మస్థాయిలో ఉండే కొవ్వు కణాలను కూడా ఇది గుర్తించగలదు. ఈ పద్ధతి దాదాపు 80 శాతం కచ్చితత్వంతో ప్రమాదకరమైన కణుతులను గుర్తించగలదని జెఫ్రీ కాడెడూ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి ఇది శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కాదని.. అనవసరంగా పదే పదే శస్త్రచికిత్సలు చేసే అవసరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఒక్కసారి చార్జ్‌చేస్తే చాలు..
వాషింగ్టన్: ఒక్కసారి సెల్‌ఫోన్ చార్జ్ చేస్తే వారం వరకు చార్జింగ్ ఉండే బ్యాటరీని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘డిమీథైల్ ఫినజైన్’ అని పేరు పెట్టారు. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలలో ఉత్పత్తి అయిన విద్యుత్ ‘ఆక్సిడైజర్’లో నిల్వ ఉంటుంది. టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు లిథియం-ఎయిర్ (లిథియం-ఆక్సిజన్) బ్యాటరీకి కొన్ని మార్పులు చేసి చార్జింగ్ పెంచారు. ఈ విధానంలో లిథియం-ఎయిర్ బ్యాటరీలకు ‘ఎలక్ట్రోలైట్’ ఉత్ప్రేరకం, ఆక్సిజన్‌ను వాడి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ బ్యాటరీలు సాధారణ బ్యాటరీల కంటే పది రెట్లు ఎక్కువ సాంద్రత గల విద్యుత్‌ను నిల్వచేసుకుంటాయి. వీటి ద్వారా ఎలక్ట్రిక్ కారుకు ఒక్కసారి చార్జ్ చేస్తే 640 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, మొబైల్‌ను ఒకసారి చార్జ్ చేస్తే వారం వరకు ఉంటుదని పరిశోధన సారథి కయాంజ్ చో వివరించారు.


