పానీపూరీలో ఉంగరం పెట్టి.. యువతికి వెరైటీ పెళ్లి ప్రపోజల్..

This Man Proposed To His Girl Friend By Hiding The Ring Inside A Pani Puri - Sakshi

పానీ పూరీ.. తలుచుకోగానే నోట్లో నీరు ఊరని వారుండరు. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు పానీపూరీని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఇక్కడొక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి చేయబోయే లవ్‌ ప్రపోజ్‌ కూడా పానీపూరీతోనే చెప్పాడు. ‘ఆ యువతికి గప్‌చుప్‌లంటే ప్రాణం.. ఆ గప్‌చుప్‌లో ఏదైన పెట్టి ప్రపోజ్‌ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు...’ ఆలోచన వచ్చిందో లేదో.. వెంటనే అమలులో పెట్టేయాలనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆ యువతి దగ్గరకు వెళ్లి సరదాగా గప్‌చుప్‌ తినడానికి వెళదామని కోరాడు.

ఈ క్రమంలో వారిద్దరు కలిసి గప్‌చుప్‌ షాపు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ, కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, అ‍ప్పటికే  సదరు యువకుడు తన ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆ గప్‌చుప్‌ షాపువారు.. ఒక ప్లేట్‌లో కొన్ని గప్‌చుప్‌లు, మసాలా, బటానీ పెట్టిచ్చారు. ఇతను మాత్రం ఒక గప్‌చుప్‌లో బంగారు ఉంగరాన్ని ఉంచాడు. ఆ ప్లేటును ఆ యువతికి ఇచ్చాడు. అయితే, ఆ యువతి ఆ గప్‌చుప్‌ ప్లేటును తీసుకుంది. దానిలో మధ్యలో ఉ‍న్న పానీపూరీ ఏదో మెరుస్తూ కనిపించింది. కాసేపు.. సరిగ్గా చూసేసరికి అది ఒక ఉంగరం అని గుర్తుపట్టింది. వెంటనే ఆ యువకుడిని చూసింది. అతగాడి ముఖం అప్పటికే ఏదో వెలిగి పోతుంది.

ఆ యువకుడు, నవ్వుతూ.. తన మనసులో మాటను ఆ యువతికి తెలియజేశాడు. ఈ వెరైటీ సర్‌ప్రైజ్‌కి ఆ యువతి ఎంతో సంతోషించింది. ఆమె ఆనందంగా ఉండటం చూసిన యువకుడు.. ఇక క్షణం ఆలస్యం చేయకూడదని ‘ ఆ ఉంగరాన్ని చూపిస్తూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా..’ అంటూ ఆమెను  ‍ప్రపోజ్‌ చేశాడు. మొదట ఆశ్చర్యపోయినప్పటికి ఆ యువకుడి నిజాయితీకి ఆమె ఫిదా అయ్యింది. ఆ యువతి కూడా సరిగ్గా పానీపూరీ బండి దగ్గరే తన ప్రియుడి ప్రపోజల్‌కి ఒకే చెప్పేసింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు. ఈ క్లిప్పింగ్‌లను ట్విట్టర్‌లోని ‘మంత్లీ అందాజ్ ఇ జాన్’ అనే పేజీలో పోస్టు చేశారు.

ప్రస్తుతం​ ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్నిచూసిన నెటిజన్లు ‘మీ.. ఐడియా సూపర్‌..’, ‘ పానీపూరీకి ఏ అమ్మాయి ‘నో’ చెప్పలేదు. మరి అలాంటి పానీపూరిలో రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తే.. ఆమె ‘నో’ అనగలదా? ’, ‘ ఆమె పానీపూరి చూడ కుండా తింటే ఏమై ఉండేదో..’, ‘ కొంత యువతులకు పానీపూరీని అమాంతం మింగేస్తారు.. ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.  

చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్‌ వీడియో

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top