మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్‌ వీడియో

Man Uses This Bizarre Trick to Get A Seat In Crowded Metro Viral Video - Sakshi

సాధారణంగా మెట్రో సౌకర్యం ఉన్న నగరాలలోని ‍ప్రజలు.. తమ ప్రయాణానికి మెట్రోకు అధిక ప్రాధాన్యత ఇ‍స్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి మెట్రో రైలులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కనీసం నిల్చోవటానికి ఖాళీ స్థలం కూడా దొరకని సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం? మహా అయితే అక్కడ ఉండే రోప్‌ను పట్టుకుని పడిపోకుండా నిల్చుంటాం. కానీ ఇక్కడో యువకుడు మాత్రం తనకు మెట్రో రైలులో సీటు దొరకలేదని వింతగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడి‍యో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక యువకుడు మెట్రో రైలు ఎక్కాడు. ట్రైన్‌ అంతా చాలా రద్దీగా ఉంది. నిల్చోవటానికి తప్ప కూర్చోవటానికి ఎక్కడా చోటు లేదు. చాలా సేపు నిలబడినందుకు కాళ్లు నొప్పిపెట్టాయో లేదా ఇంకేం అయిందో తెలీదుగానీ వెంటనే నిల్చున్న చోట మూర్ఛ వచ్చినట్టు వణకిపోయాడు. దీంతో అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు ఆందోళనపడ్డారు.

వెంటనే ఒక మహిళ లేచి అతడు కూర్చోవడానికి తన సీటు ఇచ్చింది. మరో మహిళ అతని టోపి కింద పడిపోతే అది తీసి సీటు పైన పెట్టింది. ఈ క్రమంలో, అతగాడు.. సీటుపై కూర్చున్న మరోసారి షాక్‌ కొట్టినట్లు వణికాడు. కానీ, ఈసారి తోటి ప్రయాణికులు సదరు యువకుడి ప్రవర్తన పట్ల కాస్త అనుమానంగా చూశారు. బహుషా.. ఇది ప్రాంక్‌ ఏమో.. అనుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ గా మారింది. దీన్న చూసిన నెటిజన్లు.. ‘ఏం.. తెలివి భయ్యా.. నీది’, ‘తోటి వారిని ఫుల్స్‌ చేశావ్‌ గా..’, ‘ అయినా.. ఇలా చేయడం సరైన పనికాదు, ‘ మొత్తానికి సీటు సంపాదించావ్ ‌’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: స్తంభంపైకి ఎక్కిన ఎలుగుబంటి.. విద్యుత్​ అంతరాయం..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top