గవర్నర్‌ పదవికి పోటీ.. జోకర్‌ వేషంలో నామినేషన్‌ | Man Makeup Like A Joker For Chiba Prefecture | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ పదవికి పోటీ.. జోకర్‌ వేషంలో నామినేషన్‌

Mar 13 2021 7:24 PM | Updated on Mar 14 2021 1:38 AM

Man Makeup Like A Joker For Chiba Prefecture - Sakshi

గవర్నర్‌ పదవి కోసం పోటీ పడుతున్న ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్‌ దాఖలు చేశాడు. ప్రముఖ కామిక్‌ సూపర్‌ విలన్‌ వేషధారణతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించాడు. వివరాలు.. జపాన్‌లోని టోక్యోకు చెందిన యుసుకే కవాయ్‌.. చిబా ప్రాంత గవర్నర్‌ పదవి కోసం పోటీ పడుతున్నాడు. తాజాగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాడు. నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా ఆయన వేష ధారణ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ కామిక్‌ సూపర్‌ విలన్‌ జోకర్‌ వేశాన్ని ఆయన ధరించారు. అనంతరం తన యూట్యూబ్‌ ఖాతా ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తానన్న దానికి సంబంధించిన ప్లాన్స్‌ను వెల్లడించాడు.

అయితే తన ప్రత్యర్థి మసయుకి హిరత్సుకాను రెచ్చగొట్టడానికే ఆ విధంగా జోకర్‌ వేషం వేశాడని లోకల్‌ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కవాయ్‌ తన జాబ్‌ను వదిలేసిన తర్వాత సినిమా రంగంలో కమెడియన్‌గా స్థిరపడాలనుకున్నాడని వెల్లడించాయి. కాగా, కవాయ్‌ వేషంపై స్పందిస్తున్న నెటిజన్లు.. ముఖం చూపించడానికి భయపడే అతడలా వేషం వేసుకున్నాడని విమర్శిస్తున్నారు.

చదవండి : నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని..

సింహం పిల్లను తెచ్చుకుని మరీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌

Advertisement
 
Advertisement
Advertisement