ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్‌..

Man Happily Married With Beautiful 8 wives, Lives in One Home - Sakshi

Man With 8 Wives In Thailand: సాధారణంగా ఒక వ్యక్తి ఒక మహిళనే పెళ్లాడటాన్ని సమాజం, చట్టం అంగీకరిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో భర్త లేదా భార్యకు తెలీయకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం వంటివి జరుతున్నాయి. అయితే ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక వీరందరిని ప్రేమించి మనువాడటం విశేషం. అంతేనా.. ఎనిమిదిమంది భార్యలతో ఎలాంటి గొడవలు లేకుండా ఒకే ఇంటిలో ఎంచక్కా కాపురం కూడా చేస్తుండటం మరో విశేషం. 

థాయ్‌లాండ్‌కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ అనే టాటూ ఆర్టిస్ట్‌ తన ఎనిమిది మంది భార్యలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటిలో నాలుగు బెడ్ రూములు ఉండగా.. ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున ఎనిమిది మందితో కాపురం చేస్తున్నాడు. ఇటీవల తన వైవాహిక జీవితం గురించి ఓ టీవీ షోలో మాట్లాడాడు. ఈ షోలో సోరోట్ తన భార్యలను పరిచయం చేస్తూ, వారిని ఎలా కలిశారో వివరించాడు.
చదవండి: Winter Olympic: గాల్వాన్‌లో మారణహోమానికి పాల్పడిన వ్యక్తి టార్బ్ బేరరా..?

తన మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో చూసి ప్రేమించానని తరువాత ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పిన ఓంగ్..తన రెండో భార్యను మార్కెట్‌లోను, మూడో భార్యను హాస్పిటల్‌లో.. నాలుగు, అయిదు, ఆరో భార్యలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లలో చూసి ప్రేమించినట్లు తెలిపాడు. ఇక తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్లినప్పుడు ఏడో భార్య​ను చూసి ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. ఇక నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు.. తన ఎనిమిదో భార్యను చూసి ఇష్టపడి అక్కడే పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చానని చెప్పాడు.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!

అంతేగాక తమది ఎంతో అన్యోన్య దాంపత్యమని, తన భార్యలు అందరు తనకు సమానమేనని..తన ప్రేమను అందరికి ఒకేలా పంచుతానని చెబుతున్నాడు.అంతేకాదు నా భార్యలు చాలా అందమైనవారని, ఎంతో మంచివారని తెలిపాడు. తనను ఎంతో అపురూపంగా..ప్రేమగా చూసుకుంటారని చెబుతూ తెగ మురిసిపోయాడు. ఓంగ్ తన భార్యలు, ప్రేమ గురించి ఎంతో సంతోషంగా చెబుతుంటే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఈ రోజుల్లో ఒక భార్యతోనే వేగడం కష్టమనుకుంటే ఎనిమిది మందిని పెళ్ళి చేసుకోవడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: మంటల్లో లారీ.. ప్రాణాలకు తెగించి రియల్‌ హీరో అయ్యాడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top