వీరివీరి గుమ్మడిపండు.. దీని పేరేమి?

Man Fulfills Dream Of Living As Dog With Ultra Realistic Rough Collie Costume - Sakshi

కుక్క అనేదేగా మీ సమాధానం.. కాదు.. మనిషని మేమంటే.. నిజంగా మనిషే.. ఇది కుక్కలా బతకాలనుకున్న ఓ మనిషి కథ.. కొంచెం చిత్రమైనదే అయినా.. జపాన్‌లోని టోకోకు ఎప్పట్నుంచో ఓ కల.. లక్ష్యం.. శునకంలా బతకాలని.. కలలు కంటే సరిపోదని.. దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. కుక్కంటే ఇష్టం కాబట్టి దాని బాడీ లాంగ్వేజ్‌ అన్నీ మనోడికి వచ్చు.

మరి కుక్కలా కనిపించడం ఎలా? అది కూడా అచ్చం ఒరిజినల్‌లా కనిపించాలి. దీంతో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ‘జెప్పెట్‌’ను సంప్రదించాడు. విషయం చెప్పి.. ఆల్ట్రా రియలిస్టిక్‌ డాగ్‌ కాస్ట్యూమ్‌ తయారు చేయమని అడిగాడు. వాళ్లు కూడా చాలెంజింగ్‌గా తీసుకున్నారు. కుక్కల శరీర నిర్మాణ శైలిని అధ్యయనం చేశారు. 40 రోజుల్లో అస్సలు అనుమానం రాని రీతిలో ఈ కుక్క కాస్ట్యూమ్‌ను తయారు చేశారు.

ఎక్కడా రాజీ పడకుండా, చిన్నచిన్న డీటెయిల్స్‌ కూడా మిస్సవ్వకుండా రూపొందించారు. ఇందుకోసం రూ.11.5 లక్షలు  చార్జ్‌ చేశారు. ఇక అటు టోకో ఆనందానికి అంతే లేదు. ఈ దుస్తులు వేసుకుని.. తన యూట్యూబ్‌ చానల్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. అలాగే ఫొటోస్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఇంకేముంది... ఆ వీడియోలు స్థానిక టీవీల్లో టెలికాస్ట్‌ అయ్యాయి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు కొందరు ‘కుక్కలా బతకాలన్న ఆశ ఏందిరా..!?’ అనుకుని ఆశ్చర్యపోతే.. మరికొందరు టోకో ఆశను అర్థం చేసుకుని.. ‘ఇతరులకు హాని కలగకుండా ఆయన జీవితాన్ని ఆయన బతుకుతున్నాడు.. మనకేం’ అని మద్దతునిచ్చారు. అయితే.. ఇప్పటికీ టోకో అలాగే కుక్కలా బతుకుతున్నాడా.. లేక కాస్ట్యూమ్‌ తీసేసి.. మనిషిలా మారాడా అన్న విషయం మాత్రం తెలియలేదు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top