ఒంటిపై అండర్‌వేర్‌ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు

Man Fighting Armed Robbers Only Wearing Underpants Earn Hero Status - Sakshi

ఒక వ్యక్తి ఇంటికి కొందరూ దొంగలు దోచుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో అతను పడుకుని ఉన్నాడు. వారి అలికిడికి లేచి తాను ఎలా ఉన్నది గమనించకుండా అలానే వచ్చి వారితో వీరోచితంగా పోరాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్టీవ్‌ మిడిల్టన్‌ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు యత్నించారు.

ఆ క్రమంలోనే ఆ దుండగులు స్టీవ్‌ ఇంటి ముంగిట ఉ‍న్న కారు వద్ద గుమిగూడి ఉన్నారు. ఐతే వారి అలికిడికి స్టీవ్‌కి మెలుకువ వచ్చింది.  ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్‌ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్‌ వేర్‌ ధరించి అలానే బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు.

పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెట్టించాడు.  విచారణలో ఆ దొంగలు భవన నిర్మాణ కార్మికుల సముహం అని తేలింది. స్టీవ్‌ మాత్రం తన గురించి ఆలోచించికుండా దోచుకోవడానికి వచ్చారన్న కోపంతో అలానే బయటకు వచ్చేశానని చెబుతున్నాడు.  ఐతే తాను వారిలో ఒక్కరినైనా పట్టుకుని పోలీసులకు అప్పగించేందకు ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు వ్యక్తి స్టీవ్‌ని 'అండర్‌ వేర్‌ హిరో' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి:  ఆందోళనతో బాధపడుతున్న కూతురు కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా!)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top