భార్యతో ఎఫైర్‌ పెట్టుకున్నాడని కానిస్టేబుల్‌ ముక్కు, చెవులు కోసిన భర్త! | Man Chops Off Constable Nose Ears For Having Affair With Wife | Sakshi
Sakshi News home page

భార్యతో కానిస్టేబుల్‌ ఎఫైర్‌.. కిడ్నాప్‌ చేసి ముక్కు, చెవులు కోసేసిన భర్త!

Aug 1 2022 6:13 PM | Updated on Aug 1 2022 6:13 PM

Man Chops Off Constable Nose Ears For Having Affair With Wife - Sakshi

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌  చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త.

ఇస్లామాబాద్‌: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం ఝాంగ్‌ జిల్లాలో ఆదివారం జరిగింది. తన భార్యను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అతనితో అక్రమ సంబంధాలు కొనసాగించాలని వేధిస్తున్నాడనే కారణంతో నిందితుడు ముహమ్మద్‌ లిఫ్తీకర్‌ తన స్నేహితులతో కలిసి పోలీస్‌ కానిస్టేబుల్‌ కాసిమ్‌ హయత్‌పై ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు.

‘తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని కానిస్టేబుల్‌ కాసిమ్‌ హతయ్‌పై లిఫ్తీకర్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాధితుడిని 12 మందితో కలిసి అపహరించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో చెవులు, ముక్కు, పెదాలు కోసేశారు.’ అని పంజాబ్‌ పోలీసులు వెల్లడించారు. బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. 

గతనెల పోలీస్‌ కానిస్టేబుల్‌ హయత్‌పై పీపీసీలోని 354(మహిళపై దాడి), 384(దోపిడి), 292(అక్రమ సంబంధం)వంటి సెక్షన్ల కింద కేసు పెట్టాడు ఇఫ్తీకర్‌. తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని, అతడి వద్దకు వెళ్లిన తన భార్యపై బలవంతంగా అత్యాచారం చేసి వీడియో తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ వీడియోల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీస్‌ కానిస్టేబుల్‌ హయత్‌పై దాడి కేసులో ఇఫ్తీకర్‌తో పాటు అతడి అనుచరులను పట్టుకునే పనిలో పడ్డారు పంజాబ్‌ పోలీసులు.

ఇదీ చదవండి: Nancy Pelosi Taiwan Tour: ‘తైవాన్‌లో అడుగుపెడితే మా సైన‍్యం చూస్తూ ఊరుకోదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement