Nancy Pelosi Taiwan Tour: ‘తైవాన్‌లో అడుగుపెడితే మా సైన‍్యం చూస్తూ ఊరుకోదు’

China Warned America On Nancy Pelosi Taiwan Tour - Sakshi

బీజింగ్‌: కరోనా, మంకీపాక్స్‌ వంటి మహమ్మారులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచం అతలాకతలమవుతోన్న తరుణంలో చైనా, అమెరికాల మధ్య తైవాన్‌ వివాదం తారస్థాయికి చేరింది. తైవాన్‌ విషయంలో అగ్రరాజ్యం జోక్యం తగదంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తోంది చైనా. తాజాగా.. తైవాన్‌లో అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటించనున్నారనే వార్తల నేపథ్యంలో తీవ్రంగా స్పందించింది. తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే.. తమ మిలిటరీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. 

చైనా విదేశాంగ శాఖ సాదారణ సమావేశం సందర్భంగా ఈ హెచ్చరికలు జారీ చేసింది డ్రాగన్‌. తైవాన్‌లో అమెరికా ప్రభుత్వం తరఫున పర్యటిస్తున్న పెలోసీ మూడో వ్యక్తిగా పేర్కొన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్‌. తైవాన్‌ తమ అంతర్గతమని స్పష్టం చేశారు. ఆసియాలోని నాలుగు దేశాల పర్యటనను సింగపూర్‌తో సోమవారం ప్రారంభించారు స్పీకర్‌ నాన్సీ పెలోసీ. చైనా నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోన్న తరుణంలో తైవాన్‌లో సైతం పర్యటిస్తారన్న వార్తలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నాయి.

ఇదీ చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్‌ తకరారు.. ఏమిటీ వివాదం?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top