ఇదేం గొడవరా బాబు.. గుండుపై మందు బాటిల్‌ బద్దల్‌!

Man Breaks Bottle On Opponent Bald Head Over Dogs Row - Sakshi

లండన్‌ : కుక్కల విషయంలో చోటుచేసుకున్న గొడవ చినికి చినికి గాలివానలా మారినట్లు అయింది. ఈ గొడవలో ఓ వ్యక్తి  మరో వ్యక్తి గుండుపై బాటిల్‌ బద్దలు కొట్టాడు. వివరాలు.. శనివారం ఇంగ్లాండ్‌, గ్రీన్‌ విచ్‌లోని థేమ్స్‌ పాత్‌(నడక దారి)లో ఎర్ర టీ షర్టు వేసుకుని, చేతిలో మందు బాటిల్‌తో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడి పక్క తెల్ల టీ షర్టుతో ఉన్న మహిళ, కుక్కపిల్లను నడిపించుకుంటూ వెళుతోంది. అదే దారిలో ఓ మహిళ పెద్ద కుక్కతో నిలబడి ఉంది. చిన్న కుక్క పిల్ల.. పెద్ద కుక్క దగ్గరకు రాగానే పెద్ద కుక్క, చిన్న కుక్కపిల్ల మీద దాడి చేయటానికి ప్రయత్నించింది. దీన్ని అడ్డుకున్న ఎర్ర టీషర్టు వ్యక్తి.. పెద్దకుక్క యజమాని అయిన మహిళను తిట్టడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన తెల్ల టీషర్టు వేసుకుని గుండుతో ఉన్న వ్యక్తి వారి మధ్యలోకి వచ్చాడు. ఎర్ర టీషర్టు వ్యక్తితో వాగ్వివాదానికి దిగాడు. వీళ్లు ఇలా గొడవ పడుతుండగా చేతిలో కోక్‌ బాటిల్‌తో ఓ బట్ట తల వ్యక్తి వీరి మధ్యలోకి వచ్చాడు.

ఆ గొడవకు అతడికి ఏం సంబంధం ఉందో.. ఎర్ర టీ షర్టు వేసుకున్న వ్యక్తికి అతడి ఏం పగ ఉందో తెలియదు కానీ, ఎర్ర టీషర్టు వేసుకున్న వ్యక్తి మూతమీద ఓ పంచ్‌ ఇచ్చాడు. దీంతో ఎర్ర టీషర్టు వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. కొట్టిన వ్యక్తిని కాకుండా తనతో గొడవ పడుతున్న తెల్ల టీషర్టు వ్యక్తి గుండుపై మందు బాటిల్‌ బద్దలు కొట్టాడు. ఈ గొడవ అంతటితో ఆగలేదు. రోడ్డు మీదే ఇద్దరూ బాహాబాహీకి దిగారు. కొద్దిసేపటి తర్వాత జనం ఎర్ర టీషర్టు వ్యక్తిని మూకుమ్మడిగా తరిమేశారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ దాడికి సంబంధించిన వీడియో వైరలైనప్పటికి, తమ వద్ద ఎలాంటి కేసు నమోదు కాలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top