వరదల్లో కొట్టుకుపోయిన 20 కేజీల బంగారం.. తర్వాత ఏం జరిగిందంటే? | Locals In China Dig For 12 Crore Of Gold Washed Away In Flash Flood | Sakshi
Sakshi News home page

వరదల్లో కొట్టుకుపోయిన 20 కేజీల బంగారం.. తర్వాత ఏం జరిగిందంటే?

Jul 31 2025 9:17 AM | Updated on Jul 31 2025 9:42 AM

Locals In China Dig For 12 Crore Of Gold Washed Away In Flash Flood

చైనాను కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు కారణంగా షాంగ్జీ ప్రావిన్స్‌లో  ఓ బంగారం షాపులో నుంచి గోల్డ్‌, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో జనం పోటీపడ్డారు. షాంగ్జీ ప్రావిన్స్‌లోని వుచి కౌంటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఈ ప్రాంతం భారీ వర్షాలతో వరదమయంగా మారింది. బంగారు నగల షాపును ఎప్పటిలాగే జులై 25న ఉదయం తెరిచారు. దీంతో వరద నీరు దుకాణంలోకి దూసుకొచ్చింది. దీంతో షాపులోని నగలు కొట్టుకుపోయాయి. సేఫ్‌ బాక్సులో రీసైకిల్‌ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు ఆ షాపు యజమాని పేర్కొన్నారు. దాదాపు 20 కిలోల బంగారం, వెండి గల్లంతయ్యాయి. మొత్తం నష్టం విలువ 10 మిలియన్ యువాన్ (రూ.12 కోట్లు)గా అంచనా.

 

 అయితే, బంగారం కొట్టుకుపోయిన విషయం తెలియగానే స్థానికులు భారీగా వీధుల్లోకి చేరుకుని బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు. మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి మరి ఆభరణాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు 1 కిలో బంగారం మాత్రమే తిరిగి లభించింది. కొంతమంది స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చారు కానీ చాలా మంది తిరిగి ఇవ్వలేదని దుకాణ యజమాని తెలిపారు. బంగారాన్ని దొంగిలించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement