జిబూటి తీరంలో వలసదారుల పడవ మునక  | Yemen-Bound Migrant Boat Capsizes Near Djibouti, 109 Dead And Over 116 Missing, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జిబూటి తీరంలో వలసదారుల పడవ మునక 

Oct 11 2026 5:27 PM | Updated on Oct 12 2026 12:27 PM

At least 109 dead after migrant boat capsizes off Djibouti

15 మంది చిన్నారులు సహా 139 మంది జలసమాధి 

జెనీవా: తూర్పు ఆఫ్రికాలోని జిబూటి తీరానికి సమీపంలో వలసదారుల పడవ మునిగిపోయింది. ఈ దారుణ ఘటనలో 15 మంది చిన్నారులు సహా 139 మంది జలసమాధి అయ్యారు. 305 మందితో ప్రయాణిస్తున్న ఈ పడవ ప్రమాదకరమైన హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా నుంచి అరేబియా ద్వీపకల్పంలోకి ప్రవేశిస్తుండగా ప్రమాదానికి గురైందని అంతర్జాతీయ వలసల సంస్థ ఆదివారం వెల్లడించింది. 

జిబూటి నుంచి యెమెన్‌కు వెళ్తుండగా శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. 80 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. వీరిలో అత్యధికులు ఇథియోపియన్లని తెలిపింది. ధనిక గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వెళ్తూ ఇలా ప్రమాదం బారిన పడ్డారని వెల్లడించింది. ఘటనాస్థలిలో అన్వేషణ, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వివరించింది. గతేడాది హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా–అరేబియా ద్వీపకల్పం మార్గంలో 900 మందికి పైగా వలసదారులు మరణించడమో లేక గల్లంతవడమో జరిగిందని తెలిపింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement