
బీజింగ్: ఆకస్మిక వర్షాలు, వరదలతో దక్షిణ చైనా వణికిపోతోంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల కారణంగా గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 47 మంది, ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి.