యుద్ధ విమానాల ప్లాంట్‌ను సందర్శించిన కిమ్‌ | Sakshi
Sakshi News home page

యుద్ధ విమానాల ప్లాంట్‌ను సందర్శించిన కిమ్‌

Published Sat, Sep 16 2023 5:58 AM

Kim Jong Un visits a Russia fighter jet factory - Sakshi

సియోల్‌: రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్‌స్క్‌ ఆన్‌ అముర్‌లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటర్‌ జెట్‌ ఎస్‌యూ–57ను ఆయన ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్‌ విడుదల చేసింది.

ఒక ఎస్‌యూ–35 ఫైటర్‌ జెట్‌ ల్యాండ్‌ అయినప్పుడు కిమ్‌ చప్పట్లు కొడుతున్నట్లుగా ఉంది. కిమ్‌ సుఖోయ్‌ ఎస్‌జే–100 ప్యాసింజర్‌ విమానాల ప్లాంట్‌ను కూడా సందర్శించారని తెలిపింది. కిమ్‌ వెంట రష్యా ఉప ప్రధాని డెనిస్‌ మంటురోవ్‌ ఉన్నారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్‌ భేటీ అయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement