క్షమాపణలు కోరిన కిమ్‌

Kim Jong Un Apologises Over South Korean Citizens Killing - Sakshi

సియోల్‌ : సముద్రతీరంలో దక్షిణ కొరియా పౌరుడిని కాల్చిచంపడం పట్ల ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శుక్రవారం క్షమాపణ కోరారు. ఇది ఊహించని విషాద ఘటనని సియోల్‌ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. దక్షిణ కొరియా ఫిషరీస్‌ అధికారిని మంగళవారం ఉత్తర కొరియా సైనికులు కాల్చిచంపారు. కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ పట్ల జాగ్రత్తల కారణంగా అధికారి మృతదేహం ఇంకా సముద్ర జలాల్లోనే ఉందని ఉత్తర కొరియా పేర్కొంది.

కొరియా దళాలు దక్షిణ కొరియా పౌరుడిని చంపడం దశాబ్ధ కాలం తర్వాత ఇదే తొలి ఘటన కావడంతో దక్షిణ కొరియాలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కరోనా వైరస్‌తో దక్షిణ కొరియా సమస్యల్లో కూరుకుపోయిన క్రమంలో సాయం చేయాల్సిన తరుణంలో అధ్యక్షుడు మూన్‌, దక్షిణ కొరియన్లను నిరాశపరిచినందుకు కిమ్‌ క్షమాపణలు చెప్పారని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు సు హున్‌ పేర్కొన్నారు. చదవండి : కిమ్‌ చాలా తెలివైన వాడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top