కిమ్‌ చాలా తెలివైన వాడు

Bob Woodward is book Rage reveals about US President Donald Trump - Sakshi

బాబ్‌ వుడ్‌వర్డ్‌ ‘రేజ్‌’ పుస్తకంలో అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: వాషింగ్టన్‌ పోస్ట్‌ ఎడిటర్, సీనియర్‌ పాత్రికేయుడు 77 ఏళ్ళ బాబ్‌ వుడ్‌వర్డ్‌ రాసి ‘రేజ్‌’ ’పేరుతో ప్రచురించిన పుస్తకంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంతరంగం స్పష్టమైంది. సీనియర్‌ జర్నలిస్టు వుడ్‌వర్డ్‌ గత డిసెంబర్‌ నుంచి జూలై వరకు పలు దఫాలుగా జరిపిన 18 ఇంటర్వ్యూల వివరాలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు.

2018లో సింగపూర్‌లో ఉత్తర కొరియా అ«ధ్యక్షుడు కిమ్‌ని మొదటిసారి కలిసినప్పుడే తనని ఆకట్టుకున్నాడని, కిమ్‌ చాలా తెలివైన వ్యక్తి అనీ, ఆయన తనకి అన్ని విషయాలు చెప్పాడనీ, చివరకు తన సొంత అంకుల్‌ని చంపిన వైనాన్నీ గ్రాఫిక్స్‌లో వివరించాడని ట్రంప్‌ పేర్కొన్నట్టు పుస్తక రచయిత వెల్లడించారు. కిమ్‌తో అణ్వాయుధాలపై జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని ఎప్పటికీ వీడబోదని, అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారుల అంచనాలు తప్పని ట్రంప్‌ కొట్టిపారేశారు. ఉత్తర కొరియాని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో సీఐఏకీ తెలియదని ట్రంప్‌ చెప్పారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు అవసరం లేని రేటింగ్‌ ఇచ్చారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దేశంలో గతంలో ఎప్పుడూ లేని అణ్వాయుధ వ్యవస్థని ఏర్పాటు చేశానని, అమెరికాకి ఉన్న రహస్య ఆయుధాలు ప్రపంచంలో మరెవ్వరికీ లేవని, ట్రంప్‌ చెప్పినట్లు ఈ పుస్తక రచయిత పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కావాలనే తక్కువ చేసి మాట్లాడిన విషయాన్ని అంగీకరించిన ట్రంప్, ప్రజలను భయభ్రాంతుకు గురిచేయడం ఇష్టంలేకనే తానలా మాట్లాడానన్నారు. సెప్టెంబర్‌ 15న మార్కెట్‌లోకి విడుదల కానుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top