నాన్నే గిఫ్ట్‌గా వస్తే..

Kid unwraps gifts to find military dad inside - Sakshi

ఆడ పిల్లలకు నాన్న అంటే ఎంత ఇష్టమో చెప్పలేం. అమ్మలా ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేయకున్నా.. నాన్న అంటేనే వాళ్లకు ఎక్కువ ఇష్టం. ఎక్కువ సమయం నాన్నతో గడపడానికే ఆడ పిల్లలు ఇష్టపడతారు. ఒక్క రోజు కనిపించకపోతే ‘నాన్న కావాలి’ అని మారం చేస్తుంటారు. అలాంటిది కొన్ని నెలల పాటు నాన్న కనిపించకపోతే.. ఆ పసి హృదయం ఎలా తట్టుకుంటుంది. ‘నాన్న కావాలి’ అంటూ కనీసం రోజుకు ఒక్కసారైనా మారం చేస్తుంటారు. వాళ్లని సముదాయించడానికి తల్లి ఏదోఒకటి చెప్పి నచ్చజెప్పుతారు. అలా ప్రతి రోజు నాన్న కావాలి అని మారం చేస్తున్న ఓ పాప మనసుని అర్థం చేసుకొన‍్న ఓ తల్లి.. నాన్ననే బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. ఏదో స్పెషల్‌ బహుమతి అనుకొని ఓపెన్‌ చేసిన పాప... నాన్నను చూసి ఆనందంతో చిందులేస్తూ ముద్దులతో ప్రేమ వర్షాన్ని కురిపించింది. పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 
(చదవండి :  అక్కడేందుకు కూర్చున్నావ్‌?’)

అమెరికా  వైమానిక దళానికి చెందిన స్టాఫ్ సార్జెంట్ తిమోతి వైట్ కొన్ని నెలల తర్వాత 2018లో తన ఇంటికి తిరిగి వస్తాడు. అయితే మాములుగా రాకుండా తన కూతురు హార్పర్‌ని సర్‌ప్రైజ్‌ చేయడానికి బహుమతి రూపంగా ఇంటి ముందుకు వచ్చాడు. క్రిస్మస్‌ పండగ సందర్భంగా నీకో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అని అమ్మ చెప్పడంతో.. ఆ చిన్నారి పరుగున వచ్చి గిప్ట్‌ ఓపెన్‌ చేస్తుంది. వెంటనే అందులో నుంచి తమోతి లేస్తాడు.. నాన్నను చూసిన హార్పర్‌.. ఆనందంతో అతని హగ్‌ చేసుకుంటుంది. ముద్దులు పెట్టి.. ఒళ్లో చేరి ఆడుకుంటుంది. ఇదంతా తల్లి వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం  ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఆడ పిల్లలకు నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం’, ‘నాన్న ఉద్యోగం కోసం వెళ్లాడని ఆ చిన్నారికి తెలియదు. నాన్న తనతోనే ఉండాలని ప్రతి చిన్నారి కోరుకుంటుంది. పసి పిల్లల ప్రేమ వెల కట్టలేనిది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top