ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వింత కోరిక.. ట్రంప్‌ అందుకు ఒప్పుకుంటారా? | Kash Patel Wants Direct Hotline To Trump | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వింత కోరిక.. ట్రంప్‌ అందుకు ఒప్పుకుంటారా?

Mar 9 2025 5:04 PM | Updated on Mar 9 2025 5:05 PM

Kash Patel Wants Direct Hotline To Trump

వాషింగ్టన్‌: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు సారథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన కాష్  పటేల్ తన నీడను తానే నమ్మడం లేదు. అందుకే తనకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మధ్య ఫోన్‌ కాల్స్‌ కనెక్ట్‌ చేసేందుకు ఎఫ్‌బీఐలో ఓ వ్యవస్థ ఉంది. దానికి బదులుగా నేరుగా ట్రంప్‌తో మాట్లాడే సదుపాన్ని కల్పించాలని ఆదేశించారు. అందుకు ట్రంప్‌ ఒప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

 ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ తన పనిమీద రాజకీయ ప్రమేయం ఉండకూడదని భావిస్తున్నారు. అందుకే జోబైడెన్‌ ప్రభుత్వ హయాం నుంచి ఎఫ్‌బీఐ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు,ఏజెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తాను ఎఫ్‌బీఐ ఆఫీస్‌లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ట్రంప్‌తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందా? ఉంటే సాధ్యసాధ్యాలను చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. 

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా వచ్చీ రాగానే ఎఫ్‌బీఐ కార్యాలయం ఏడవ ఫ్లోర్‌లోని అధికారులను తొలగించారు. ఆ ఫ్లోర్‌లో డైరెక్టర్‌గా ఏదైనా నిర్ణయం తీసుకున్నా, దాన్ని అమలు చేయాలన్నా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ హోదాలో డిప్యూటీ అటార్నీ జనరల్‌తో మాట్లాడుతారు.డిప్యూటీ అటార్నీ జనరల్‌ ఇతర సీనియర్‌ అధికారులతో మంతనాలు జరిపి కార్యకలాపాలు నిర్వహిస్తారు. వారినే తొలగించి మరో ఫ్లోర్‌లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

సెక్యూరిటీ రిత్యా సీనియర్ ఎఫ్‌బీఐ అధికారులు తమ కార్యాలయాల్లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. తాజాగా,వైట్ హౌస్ స్విచ్‌బోర్డ్, సీఐఏ, ఇతర జాతీయ భద్రతా సంస్థలతో మాట్లాడేందుకు వీలుగా ట్రంప్‌తో మాట్లాడేలా సురక్షితమైన ల్యాండ్‌లైన్ వ్యవస్థ ఇప్పటికే చాలా మంది ఎఫ్‌బీఐ అధికారుల డెస్క్‌లపై ఉంది. బదులుగా కాష్‌ పటేల్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడేలా చూడాలని కోరినట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి.  

అదనంగా, పటేల్ తన రక్షణ కోసం ఇప్పటికే ఎఫ్‌బీఐ ఏజెంట్లను నియమించినప్పటికీ, తన సొంత ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని పరిశీలించినట్లు సమాచారం. పటేల్ ఎఫ్‌బీఐ ఏజెంట్లను పూర్తిగా విశ్వసించడం లేదని, కాబట్టే ప్రైవేట్‌ భద్రతా సిబ్బందిని నియమించుకోనున్నారు.

కాగా,చరిత్రలో తొలిసారి ఎఫ్‌బీఐ తొలిడైరెక్టర్‌ జే. ఎడ్గార్ హూవర్ తన ఇంటి నుండి అధ్యక్షుడికి నేరుగా ఫోన్‌లో మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి ఎఫ్‌బీఐ, వైట్‌ హౌస్‌ల మధ్య ఓ ఫోన్‌ కాల్‌ వ్యవస్థ ఏర్పాటైంది. మళ్లీ ఇప్పుడు కాష్‌ పటేల్‌ ఆ సంప్రదాయానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement