బైడెన్‌కు తీవ్ర నిద్ర సమస్య

Joe Biden uses breathing machine to treat his sleep apnea - Sakshi

ఆయన సీపాప్‌ ఉపకరణం వాడుతున్నారన్న శ్వేతసౌధం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిద్రకు సంబంధించిన స్లీప్‌ అప్నియా అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో, ఆయన కొన్ని రోజులుగా నిద్ర కోసం సీపాప్‌(కంటిన్యువస్‌ పాజిటివ్‌ ఎయిర్‌ వే ప్రెజర్‌) అనే యంత్రాన్ని వాడుతున్నారని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. స్లీప్‌ అప్నియా సమస్య ఆయనకు దశాబ్దకాలంగా ఉందని తెలిపారు. 2008 నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన తన మెడికల్‌ రిపోర్టుల్లో వెల్లడిస్తున్నారని కూడా పేర్కొన్నారు.

స్లీప్‌ అప్నియా అనేది సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోతుంటుంది. ఈ సమస్య ఉన్న వారు రాత్రి మొత్తం నిద్రపోయినా పగటి వేళ అలసిపోయినట్లు ఉంటారు. సీపాప్‌ యంత్రాన్ని అధ్యక్షుడు మంగళవారం రాత్రి కూడా వాడాల్సి వచి్చందని వైట్‌హౌస్‌ అధికారులు వివరించారు. షికాగోలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు బయలుదేరిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి. సీపాప్‌ పరికరాన్ని వాడటం వల్లే ఇలా గీతలు పడ్డాయని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top