అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్ ఇచ్చిన తరువాత, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
'జే క్లేటన్'ను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) పదవికి ఎంపిక చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పదవి అమెరికా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన భద్రతా బాధ్యతలలో ఒకటి. దేశంలోని అన్ని గూఢచార సంస్థల పనిని సమన్వయం చేయడం ఈ పదవి ప్రధాన బాధ్యత.
జే క్లేటన్‌ను అమెరికా అధ్యక్షుడు అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ఈయన గతంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) చైర్మన్‌గా పని చేశారు. అంతే కాకుండా ఈయన సులివన్ & క్రామ్‌వెల్ మాజీ హెడ్, ప్రస్తుతం న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా పనిచేస్తున్నారని కూడా వెల్లడించారు.
నా మంత్రివర్గంలో పనిచేయడానికి క్లేటన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఈయన నియామకాన్ని వీలైనంత త్వరగా ధృవీకరించాలని నేను యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌ను కోరుతున్నాను ట్రంప్ పేర్కొన్నారు.


