కోట్లకు అధిపతి.. కానీ డెలివరీ బాయ్‌గా మారాడు

Japanese Billionaire Delivers Uber Eats Food To International Space Station Video Goes Viral - Sakshi

గతంలో తినాలంటే ఇంట్లో చేసిన ఫుడ్ లేదా బయట హాటల్‌కి వెళ్లి కడుపునిండా ఆరగించేవాళ్లం. టెక్నాలజీ పుణ్యమా అని పుడ్‌ కూడా డెలివ‌రీ యాప్స్ ద్వారా మన గడప వద్దకే వస్తోంది. ఇంకేముంది కదలకుండానే నచ్చిన ఆహారాన్ని లాగించేస్తున్నాం. ఇదంతా నిత్య జీవితంలో భాగమైపోయింది. అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన చాలా అరుదు అని చెప్పాలి.

ఎందుకంటే పుడ్‌ డెలివరీ అంటే 10 లేదా 20 కిలోమీటర్లు డెలివరీ చేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలోని వ్యక్తికి డెలివరీ చేశాడు. అది డెలివరీ చేసిన బాయ్‌ కూడా మామూలు వ్యక్తి కాదు.. ఆయనో బిలినియ‌ర్ అవ్వడం విశేషం. ఇలా చేయడం అసాధ్యమే కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఉబర్‌ పుడ్‌ డెలివరీ సంస్థ.

వివరాల ప్రకారం.. అంత‌రిక్ష కేంద్రంలో ఉంటున్న ఓ వ్యోమగామికి ఉబెర్ ఈట్స్‌ ఫుడ్‌ను డెలివ‌రి చేసింది. ఆ డెలివరీ ఇచ్చింది జపాన్‌కి చెందిన బిలినియ‌ర్ మెజ్వానా. డిసెంబ‌ర్ 11న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకోసం ఆయన దాదాపు 12 రోజుల‌పాటు అంత‌రిక్ష కేంద్రంలోని కక్ష్యలో ప్ర‌యాణం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top