హఠాత్తుగా అమ్మాయి 50 ఏళ్ల మగాడిగా మారింది! | Japanese Biker Projects Him As A Young Girl On Twitter Reveals | Sakshi
Sakshi News home page

హఠాత్తుగా అమ్మాయి 50 ఏళ్ల మగాడిగా మారింది!

Mar 19 2021 4:09 PM | Updated on Mar 19 2021 5:48 PM

Japanese Biker Projects Him As A Young Girl On Twitter Reveals - Sakshi

అమ్మాయిగా అజుసగకుయుకి

నెల రోజుల క్రితం ఆమె ఓ మిర్రర్‌ యానిమేషన్‌లో తన ఫొటోను....

టోక్యో : ఆపరేషన్ల ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలుగా మారటం.. అబ్బాయిలు, అమ్మాయిలుగా మారటం ఈ మధ్య కామన్‌ అయిపోయింది. ఇదంతా సైన్స్‌.. కానీ, ఏ ఆపరేషన్‌ లేకుండానే  20 ఏళ్ల అమ్మాయి హఠాత్తుగా 50 ఏళ్ల ఓ మగాడిగా మారితే!.. ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ న్యూస్‌ చదివేయండి.. జపాన్‌కు చెందిన ఓ మోటార్‌ బైక్‌ రైడర్‌ అజుసగకుయుకి అనే అమ్మాయికి ట్విటర్‌ ఖాతాలో 20 వేలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆమె ప్రతి రోజూ బైక్‌ పక్కన నిలబడ్డ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉండేది. ‘‘ నాకు బైక్స్‌ అంటే ప్రాణం’’ అంటూ కామెంట్లు పెట్టేది. నెల రోజుల క్రితం ఆమె ఓ మిర్రర్‌ యానిమేషన్‌లో తన ఫొటోను షేర్‌ చేసింది. అయితే కొంతమంది ఆమె అభిమానులకు ఓ వైపు ఆమె ఫొటో, మరో వైపు అంకుల్‌ ఫొటో కనిపించింది. ఆ ఫోటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మగాడిగా అజుసగకుయుకి

దీంతో జపనీస్‌ మీడియా ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆమె, ఆమె కాదని ఆమె, 50 ఏళ్ల ఓ మగాడన్న సంగతిని గుర్తించింది. దీనిపై ఆమె కాని అతడు మాట్లాడుతూ.. ‘‘సోషల్‌ మీడియాలో అంకుల్‌ను ఎవరు ఫాలో అవుతారన్న ఉద్ధేశ్యంతోనే నేనిలా చేశాను. సరదా కోసమే ఇదంతా చేశాను. నేను అమ్మాయిలా మారటానికి ఫేస్‌యాప్‌ను ఉపయోగించాను. ట్విటర్‌లో అమ్మాయిగా నన్ను నేను ప్రొజెక్ట్‌ చేసుకున్న వెంటనే 1000 మంది ఫాలోయర్లు వచ్చారు. అందుకే నా ఐడెంటిటీ బయటపెట్టలేదు’’ అని అన్నాడు.

చదవండి : వైరల్‌: నువ్వు మహిళవు కాదు! సైకోవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement