ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నేడు | Israel Heads for Crucial Parliamentary Polls on October 27 | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నేడు

Oct 27 2026 5:33 AM | Updated on Oct 27 2026 5:33 AM

Israel Heads for Crucial Parliamentary Polls on October 27

తేలనున్న నెతన్యాహూ భవితవ్యం 

అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ మెజార్టీ కష్టమే

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో మంగళవారం పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. 2023, అక్టోబర్‌ ఏడవ తేదీ నాటి హమాస్‌ దాడి తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. హమాస్‌ దాడి, ఆ తరువాత జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో నెతన్యాహూ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయతి్నస్తూండగా మాజీ సైనిక అధిపతి గదీ ఐసెన్‌కోట్, మాజీ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌లతో కూడిన ప్రతిపక్షం ఆయనకు సవాలు విçసురుతోంది. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ నెసెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉండగా మెజారిటీ కోసం 61 స్థానాలు అవసరం. 

ఆసక్తికరంగా అటు నెతన్యాహూ, ఇటు ప్రతిపక్షాలు ఇన్ని సీట్లు సాధించే అవకాశాల్లేవని ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. లికుడ్‌ పార్టీ నేతగా నెతన్యాహూ 1996 నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు ఇజ్రాయెల్‌ ప్రధానిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌ ఏడున ఒక సంగీత కచేరీపై హమాస్‌ జరిపిన దాడిలో దాదాపు 1,200 మంది మరణించగా.. ఆ తరువాత ఇజ్రాయెల్‌ పాలస్తీనా, గాజా పట్టణంపై ప్రతిదాడులతో విరుచుకుపడింది.

 వైమానిక, భూతల సైనిక చర్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. 74 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారని, 1.75 లక్షల మందికి పైగా గాయపడ్డారని అంచనా. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ ఎన్నికలు జరుగుతూండగా, భద్రత, జవాబుదారీతనం అన్నవి ప్రధాన చర్చనీయాంశాలు అయ్యాయి. నెతన్యాహూపై ఇప్పటికే అవినీతితోపాటు లంచం వంటి అనేకానేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024లో ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ కోర్టు సైతం యుద్ధ నేరాల విషయంలో నెతన్యాహూపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 

ప్రతిపక్ష నాయకులు వీరే.. 
ఈ ఎన్నికల్లో నెతన్యాహూ ప్రధాన ప్రత్యర్థి ఇజ్రాయెల్‌ రక్షణ దళాల మాజీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గదీ ఐసెన్‌కోట్‌. మధ్యేమార్గ రాజకీయవేత్త. గతంలో నెతన్యాహూ యుద్ధ మంత్రిత్వ శాఖలో పరిశీలకుడిగా పనిచేశారు. అయితే యుద్ధం విషయంలో సరైన వ్యూహమే లేదని ఆరోపిస్తూ 2024 జూన్‌లో రాజీనామా చేశారు. భద్రత విషయంలో రాజీపడకుండానే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ఈయన. ఓటరు సర్వేలో ఈయన యషర్‌ పార్టీకి మంచి మద్దతే కనిపించింది. మరోవైపు మాజీ ప్రధానులు నఫ్తాలీ బెనెట్, యాయిర్‌ లాపిడ్‌లు ‘బి’యాచద్‌’పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నిలిచారు.

ఇవీ ప్రధాన అంశాలు... 
గాజాతో యుద్ధం అమెరికాతో సంబంధాలు, ఇరాన్‌ విసురుతున్న సవాళ్లు అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్‌ ప్రతిçష్ట వంటి అంశాలు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. నెతన్యాహు నాయకత్వం, పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రత విషయంలో మాత్రం పారీ్టలు దాదాపుగా ఒకే మాటపై ఉండటం గమనార్హం. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఒకవేళ ఎన్నికల్లో నెతన్యాహూ ఓటమిపాలైనా పాలస్తీనా, గాజాల పరిస్థితిలో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చునని అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement