Israel Prime Minister Benjamin Netanyahu Admitted To Hospital, Details Inside - Sakshi
Sakshi News home page

Israel PM Hospitalised: సొమ్మసిల్లి పడిపోయిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు.. ఆస్పత్రిలో చేరిక

Jul 16 2023 6:20 AM | Updated on Jul 16 2023 12:31 PM

Israel Benjamin Netanyahu admitted to hospital - Sakshi

జెరుసలేం: ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు(73) శనివారం అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. టెల్‌అవీవ్‌లోని షెబా ఆస్పత్రిలో నెతన్యాహుకు చికిత్స అందిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది.

ఇంతకు మించి వివరాలు వెల్లడించలేదు. ఇంటి దగ్గర ఉండగా సొమ్మసిల్లి పడిపోవడంతో నెతన్యాహును ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ ఇజ్రాయెల్‌ వార్తా వెబ్‌సైట్‌ ఒకటి పేర్కొంది. ఆయన బాగానే ఉన్నారని, ఆస్పత్రిలో నడుస్తున్నారని కూడా తెలిపింది. అయితే, ఈ వార్తలు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం దాదాపు 15 ఏళ్లుగా నెతన్యాహు అధికారంలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement