మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!

Interesting Facts About Death Many Changes In Body 2 Weeks Before - Sakshi

ఈ ప్ర‌పంచంలో జ‌న్మించిన ప్ర‌తి ప్రాణికి మ‌ర‌ణం త‌ప్ప‌దు. అయితే ఏ మ‌నిషికైనా మృత్యువు స‌మీపించిన‌ప్పుడు అత‌ను ఎటువంటి అనుభూతికి గుర‌వుతాడ‌నేదానిపై లెక్క‌లేనన్ని ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ఇంకా జ‌రుగుతూనే ఉన్నాయి. కాగా ఒక నిపుణుడు దీనిపై ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు. లివ‌ర్ పూల్ యూనివర్శిటీకి ప‌రిశోధ‌కుడు సీమ‌స్ కోయ‌ల్ అందించిన ఒక ఆర్టిక‌ల్‌లోని వివ‌రాల ప్ర‌కారం.. మ‌నిషి మ‌ర‌ణించే ప్ర‌క్రియ అత‌నిలో రెండు వారాల ముందే మొద‌ల‌వుతుంది. అత‌ని ఆరోగ్యం క్ర‌మంగా క్షీణిస్తుంది. నిద్రించ‌డం కూడా ఎంతో ఇబ్బందిక‌రంగా మారుతుంది. జీవిత‌పు చివ‌రి రోజుల్లో మ‌నిషి ఔష‌ధాలు తీసుకోవడంలో, భోజ‌నం చేయ‌డంలో, ఏదైనా తాగ‌డంలోనూ త‌గిన సామ‌ర్థ్యాన్ని కోల్పోతాడు.

మ‌రికొంద‌రు ప‌రిశోధ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మెద‌డు నుంచి ప‌లు ర‌సాయ‌నాలు విడుద‌ల‌వుతాయి. వాటిలో ఒక‌టి ఎండోఫ్రిన్. ఈ ర‌సాయ‌నం మ‌నిషి భావాల‌ను అమితంగా ప్ర‌భావితం చేస్తుంది. మ‌నిషి తాను మ‌రణించే స‌మ‌యాన్ని అర్థం చేసుకోవ‌డం ఎంతో క‌ష్టం. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ అందిన ప‌లు ప‌రిశోధ‌న‌ల వివ‌రాల ప్ర‌కారం మ‌నిషి మృత్యువుకు స‌మీపిస్తున్న కొద్దీ అత‌ని శ‌రీరంలో స్ట్రెస్ కెమిక‌ల్ వృద్ధి చెందుతూ ఉంటుంది.

క్యాన్స‌ర్ బాధితుల‌కు మ‌ర‌ణ స‌మ‌యంలో శ‌రీరం వాపున‌కు గుర‌వుతుంది. మ‌ర‌ణించే స‌మ‌యంలో మ‌నిషిలో శారీర‌క నొప్పులు త‌క్కువ‌కావ‌డం విశేషం. ఇలా ఎందుకు జ‌రుగుతుందో ప‌రిశోధ‌కుల‌కు కూడా ఇంత‌వ‌ర‌కూ అంతుచిక్క‌లేదు. అయితే ఇది ఎండోఫ్రిన్ కార‌ణంగానే జ‌రుగుతుంద‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. కాగా ప్ర‌తీ మ‌నిషి మృతి ఒక్కో విధంగా ఉంటుంది. ఇటువంటి ప‌రిస్థితిలో మృత్యువుకు సంబంధించిన ప‌లు విష‌యాలు ప‌రిశోధ‌కుల‌కు సైతం అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయాయి.
చదవండి: ఆ రోడ్డుపై ప్ర‌యాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top