ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్‌.. 

Inland Taipan Most Venomous Snake Its Single Bite Can Kill Over 100 People - Sakshi

Inland Taipan: ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. పేరు ఇన్‌లాండ్‌ టైపాన్‌.. ఇది ఎంత విషపూరితమైనది అంటే.. ఒక్క కాటు విషంతో వంద మంది మనుషులు ఖతమేనట. అదే ఎలుకల లెక్క తీసుకుంటే.. 2,50,000 మూషికాలు ఫసాక్‌. దాని ఒక్క కాటులో 110 మిల్లీగ్రాముల విషం వెలువడుతుందని బ్రిస్టల్‌ వర్సిటీ  పరిశోధకులు చెబుతున్నారు.

ఇక్కడ మన అదృష్టమేంటి అంటే..  ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటుంది.  అది కూడా మారుమూల అటవీప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయి. పగటిపూట ఇవి కనిపించడం చాలా తక్కువ అని పరిశోధకులు తెలిపారు. ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిమీ పొడవు ఉంటాయి.  ఇవి కాలాన్ని అనుసరించి చర్మం రంగును మార్చుకుంటాయి. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయి. 
చదవండి: యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top