ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి.. కారణం ఇదే!

Indian Mohamed Rahmathullah Shot Dead In Australia - Sakshi

ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ పోలీసులు జరిపిన కాల్పుల్లో భారతీయ యువకుడు మృతిచెందాడు. కాగా, మృతుడిని తమిళనాడుకు చెందిన మహ్మద్‌ రెహ్మత్తుల్లా సయ్యద్‌ అహ్మద్‌గా గుర్తించారు. ఇక, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది.

వివరాల ప్రకారం.. సయ్యద్‌ అహ్మద్‌(32) బ్రిడ్జింగ్‌ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. అయితే, మంగళవారం సయ్యద్‌.. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడమే కాకుండా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై అటాక్‌ చేయబోయాడు. దీంతో, పోలీసులు.. అహ్మద్‌పై మూడు రౌండ్లలో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రెండు బుల్లెట్స్‌ అతడి చాతీలోకి దూసుకెళ్లాయి. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. సయ్యద్‌ అహ్మద్‌ మృతిచెందినట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా సిడ్నీ ఏసీపీ స్మిత్‌ మీడియాతో మాట్లాడుతూ.. సయ్యద్‌ అహ్మద్‌పై ఎలాంటి క్రిమినల్‌ రికార్డు లేదన్నారు. దీన్ని తీవ్రవాద దాడిగా తాము పరిగణించడంలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, సయ్యద్‌ మృతిపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని ఆవేదన వ్యక్తపరిచింది. అలాగే, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top