కన్సాస్ సెనేటర్‌గా ఉషా రెడ్డి

హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు.
మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది.