Sakshi News home page

కెనడాకు వీసా సేవలను నిలిపివేసిన కేంద్రం

Published Thu, Sep 21 2023 12:46 PM

India Suspends Visa Services In Canada Citing Operational Issues - Sakshi

ఒట్టావా: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని వ్యాఖ్యల తర్వాత భారత్.. కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతలోనే కెనడాలో జరిగిన మరో ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె హత్య నేపథ్యంలో కెనడా వీసాలను భారత్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.   

రెండు రోజులుగా ఈ రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా కెనడియన్ పౌరులకు వీసాల జారీని తదుపరి నోటీసు వచ్చేంత వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది భారత్. కెనడాలోని వీసా దరఖాస్తు కేంద్రాలను నడుపుతున్న BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ సంస్థ.. కొన్ని కారణాల వల్ల వీసా దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ 2023 నుండి అమలులోకి వస్తుంది, తదుపరి నోటీసు వచ్చేవరకు భారతీయ వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. దయచేసి తదుపరి అప్‌డేట్స్ కోసం BLS వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండని నోటీస్ ఇచ్చింది.  

కెనడాలో పెరుగుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని భారత్ పలుమార్లు ఆ దేశానికి విజ్ఞప్తి చేసినా ఆ దేశం వారిపై ఉదాసీబాటతో వ్యవహరించడమే కాకుండా ఖలిస్థాన్ తీవ్రవాది హార్డెప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూఆ దేశ ప్రధాని వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో వీసా సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: కెనడాలో గ్యాంగ్‌వార్: మరో ఖలిస్తానీ తీవ్రవాది హతం

Advertisement

What’s your opinion

Advertisement