Taliban: భారత్‌తో సంబంధాలు, తొలిసారి స్పందించిన అగ్రనేత

India importantwant to maintain ties:Taliban topleader - Sakshi

 భారతదేశంతో వాణిజ్యం, రాజకీయ సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నాం: తాలిబన్‌ నేత

ఇండియా తమకు ముఖ్యమైన దేశం: షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్

సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత భారత్‌తో సంబంధాలపై  తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. భారత దేశంతో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నా మని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ వెల్లడించారు. ఇండియా తమకు ముఖ్యమైన దేశమని అభివర్ణించారు. ఈ మేరకు తాలిబన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆయనొక వీడియోను షేర్‌ చేశారు.

చదవండి : Taliban-Afghanistan: జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు

అఫ్గానిస్తాన్‌ను వశం చేసుకున్న తర్వాత తాలిబన్ అగ్రనేత భారత్‌తో  సంబంధాలపై స్పందించడం ఇదే తొలిసారి. వివిధ గ్రూపులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ద్వారా  కాబూల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతున్నామని చెప్పారు. ఇది "విభిన్న వర్గాల" ప్రజల ప్రాతినిధ్యాలను కలిగి ఉంటుందంటూ దాదాపు 46 నిమిషాల వీడియోలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. షరియా ఆధారంగా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని  ప్రకటించారు.

భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా సహా వివిధ దేశాలతో సంబంధాలపై కూడా అబ్బాస్‌ మహమ్మద్  స్పందించారు. పాకిస్తాన్ ద్వారా భారతదేశంతో వాణిజ్యం చాలా ముఖ్యమైందని అన్నారు. దీనితో పాటు, ఇరాన్ గురించి మాట్లాడుతూ, అఫ్గాన్‌లో చాంబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసిన విషయాన్ని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ గుర్తు చేశారు. కాగా 1980 ప్రారంభంలో డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందిన విదేశీ క్యాడెట్ల బృందంలో స్టానెక్జాయ్ ఒకరు. తరువాత అతను అఫ్గాన్‌  సైన్యాన్ని విడిచిపెట్టారు. 

చదవండి:  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top