మళ్లీ ట్రంప్‌ నోట.. భారత్‌-పాక్‌ యుద్ధం మాట! | I do a lot, never get credit Donald Trump | Sakshi
Sakshi News home page

‘నేను ఇంకా చాలా చేస్తా’.. మళ్లీ ట్రంప్‌ నోట.. భారత్‌-పాక్‌ యుద్ధం మాట!

Jun 15 2025 8:27 PM | Updated on Jun 15 2025 9:07 PM

I do a lot, never get credit Donald Trump

ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి. మాతో అణు ఒప్పందాన్ని తిరస్కరించింది. ప్రపంచానికి పెనుముప్పుగా మారే అణు ఒప్పందానికి ఇరాన్‌ దూరంగా ఉంటుంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడి సరైనదే. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ఇంకా విరుచుకుపడాలి. ఈ దాడులు సరిపోవు.. అని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

తనకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే మరొక రకంగా ఉండటం ట్రంప్‌కు అలవాటే. ఇరాన్‌ను ఏదో రకంగా లొంగదీసుకోవాలనే ప్రయత్నమే ట్రంప్‌ వ్యాఖ్యల్లో కనబడింది.  అంటే ఇక్కడ ఇజ్రాయిల్‌ను అడ్డుపెట్టుకని ఇరాన్‌ను ఎలాగైనా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలనేది ట్రంప్‌ వ్యాఖ్యల్నే బట్టే అర్థమైంది.

 ఇప్పుడు డీల్‌ అంటూ కొత్త పాట..!
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఇరాన్‌ చవిచూసింది. మరి ట్రంప్‌ టార్గెట్‌ పూర్తయ్యిందో ఏమిటో గానీ, ఇక ఇజ్రాయిల్‌-ఇరాన్‌లు డీల్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దానికి తానే మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు. ఎలాగైతే భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానో, అలాగే వీరి మధ్య కూడా ఒక ఒప్పందంగానీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు(పాకిస్తాన్‌తో యుద్ధ విరమణలో ట్రంప్‌ ప్రమేయం ఏమీ లేదని భారత్‌ అప్పుడే స్పష్టం చేసింది. మిలటరీ డైరెక్టర్ల పరస్పర అంగీకారంతోనే ఇరు దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం​ జరిగిందని పేర్కొంది). తాను ఎన్నో శాంతి ఒప్పందాలు చేశానని, క్రెడిట్‌ మాత్రం తనకు అవసరం లేదని అంటున్నారు ట్రంప్‌.

నేను చాలా యుద్ధాలు ఆపాను..!
తాను తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో కొసావో, సెర్బియాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని, వారి మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పరిష్కరించాను. బైడెన్‌(మాజీ అధ్యక్షుడు) తెలివి తక్కువ నిర్ణయాల కారణంగా కొన్ని చోట్ల దీర్ఘకాలిక ఘ్రయోజనాలు దెబ్బతిన్నాయి. నేను దాన్ని మళ్లీ పరిష్కరిస్తా. ఇక ఈజిప్టు, ఇధియోఫియాల మధ్య నైలు నదీ వివాదం ఉంది. భారీ ఆనకట్టకు సంబంధించి వారి మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతానికి నా జోక్యంతో కనీసం శాంతి వాతావరణం ఏర్పడింది’ అని శాంతి మంత్రాన్ని మళ్లీ జపించారు.

మాట వింటే శాంతి.. వినకపోతే యుద్ధం
ఇప్పుడు ఇరాన్‌ విషయంలో జరుగుతున్నది అదే. అమెరికా మాట వినలేదనే కారణంతో ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడిన ట్రంప్‌.. ఇప్పుడు వారి మధ్య శాంతి ఒప్పందం కుదర్చాల్సిన బాధ్యత తనపైనే ఉందంటున్నారు. ట్రంప్‌ మాట వింటే భాంతి.. లేకపోతే యుద్ధం అనే పద్ధతిని ఆచరిస్తున్న ట్రంప్‌ను చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఉస్కో అని  ఒక దేశాన్ని రెచ్చగొట్టడం.. కాస్కో అని మరో దేశాన్ని హెచ్చరించడం.. ఇక చివరగా డీల్‌కు వస్తారా అంటూ పెద్దన్న పాత్రకు రెడీ కావడం ఇవే ట్రంప్‌ వైఖరిలో కనబడటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement