హౌతీల దాడులు.. అమెరికా పౌరులకు హెచ్చరిక | US issues key recommendations in the wake of Houthi attacks | Sakshi
Sakshi News home page

హౌతీల దాడులు.. అమెరికా పౌరులకు హెచ్చరిక

Oct 19 2026 4:03 PM | Updated on Oct 19 2026 4:33 PM

US issues key recommendations in the wake of Houthi attacks

వాషింగ్టన్: సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో అమెరికా మిడిల్‌ ఈస్ట్‌లోని  తమ దేశపౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.  సౌదీ, యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్, ఇరాన్‌, సహా 12 దేశాల్లోని అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.  యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏక్షణాన్నైనా విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఆయా దేశాల గగనతలాలను అకస్మాత్తుగా మూసివేయడం, విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం లేదా ప్రయాణ మార్గాలను మళ్లించడం వంటి తీవ్ర అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భద్రతా ముప్పు కారణంగా ఇరాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్ వంటి తీవ్ర ఉద్రిక్తత ప్రాంతాలకు అస్సలు ప్రయాణించవద్దని  సూచించింది. 

అంతే కాకుండా ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న తమ పౌరులను అందుబాటులో ఉన్న వాణిజ్య రవాణా మార్గాల ద్వారా తక్షణమే ఆయా దేశాలను విడిచి వెళ్లాలని, ప్రయాణాలకు ముందే విమాన సంస్థల ద్వారా ఫ్లైట్ స్టేటస్‌ను ఖచ్చితంగా సరిచూసుకోవాలని ఆదేశించింది.
 

అయితే  హౌతీ తిరుగుబాటుదారులు దాడుల నేపథ్యంలో భారత్‌ సైతం అక్కడి భారతీయులకు కీలక సూచన చేసింది. "సౌదీ అత్యవసర హెచ్చరికల వ్యవస్థ (నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్) నుంచి సమాచారం రాగానే ప్రజలు భయాందోళన చెందకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రమాదం ముగిసే వరకు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు, బాల్కనీలు, టెర్రస్‌లకు దూరంగా లోపలి గదుల్లో తలదాచుకోవాలి ఒకవేళ బయట ఉంటే సమీపంలోని భవనంలోకి వెళ్లాలి" అని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది.


ఇదీ చదవండి: భారత పౌరులకు హెచ్చరిక  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement