హైతీలో 1,297కు చేరిన భూకంప మరణాలు | Haiti Earthquake More Than Twele Hundred People Lost Life | Sakshi
Sakshi News home page

హైతీలో 1,297కు చేరిన భూకంప మరణాలు

Aug 17 2021 10:58 AM | Updated on Aug 17 2021 11:02 AM

Haiti Earthquake More Than Twele Hundred People Lost Life - Sakshi

లెస్‌ కేయాస్‌ (హైతీ): కరీబియన్‌ దేశం హైతీలో శనివారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 1,297కు చేరింది. దాదాపు 5,700 మంది గాయపడగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. క్షతగాత్రులతో అక్కడి ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. మరోవైపు తీవ్ర తుపాను ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా, అధ్యక్షుడి హత్య, సాయుధ ముఠాల  ఘర్షణలు వంటి సమస్యలతో అల్లాడుతున్న హైతీకి భూకంపం, భారీ వర్షాలు పరిస్థితులను మరింత జఠిలం చేశాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement