ఒకవైపు కరోనా.. మరొకవైపు కార్చిచ్చు బెంబేలెత్తిస్తున్నాయి

Greece Wildfires Spread Causing Mass Evacuations - Sakshi

బెంబేలెత్తుతున్న దేశాలు  

గ్రీస్‌లో 30 ఏళ్ల రికార్డులు బద్దలు  

కాలిఫోర్నియా/ఏథెన్స్‌: ఒకవైపు కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉంటే, మరో వైపు  వివిధ దేశాల్లో కార్చిచ్చులు బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, గ్రీస్, టర్కీ, ఇటలీ, సైబేరియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాల్లో కార్చిచ్చులతో అడవులు దగ్ధమైపోతూ ఉంటే, వాటి బారిన పడకుండా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రీసులో గత 30 ఏళ్లలో ఈ స్థాయిలో కార్చిచ్చులు చెలరేగలేదు. రాజధాని ఏథెన్స్‌ శివార్లలోని మౌంట్‌ పర్ణీతలో చెలరేగిన దావానలంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. ఎకరాలకి ఎకరాలు అటవీ భూములు, ఇళ్లు, వాణిజ్య కేంద్రాలు కళ్ల ముందే అగ్నికి ఆహుతైపోతున్నాయి. 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది రేయింబగళ్లు మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నా కార్చిచ్చుల్ని అదుపు చెయ్యలేకపోతున్నారు.

దేశవ్యాప్తంగా 400 ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడడం ఆందోళనకు గురి చేస్తోంది. ‘‘మాకు ఇవి చాలా చెడ్డ రోజులు. గ్రీస్‌ అంతా దగ్ధమైపోతున్నట్టుంది. ఎప్పుడూ ఈ స్థాయిలో కార్చిచ్చుల్ని చూడలేదు’’ అని ఏథెన్స్‌ వాసి థానాసిస్‌ కలౌడిస్‌ చెప్పారు. మొదటిసారి ఒలింపిక్స్‌ క్రీడలు జరిగిన ఒలింపియా అంతా కార్చిచ్చులతో మండిపోతోంది. ఇవియా, పెలోపాన్నెస్, మెసీనియా ప్రాంతాల్లో కూడా అగ్ని జ్వాలలు ఎగసెగసి పడుతున్నాయి. గ్రీస్‌ పొరుగుదేశమైన టర్కీలో కూడా కనీవినీ ఎరుగని రీతిలో కార్చిచ్చులు విస్తరిస్తున్నాయి.  

343 మెగాటన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల  
ఉత్తర అమెరికా, సైబీరియా, ఆఫ్రికా, దక్షిణ యూరప్‌ దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వేలాది హెక్టార్లు అగ్నికీలల్లో దగ్ధమవుతూ ఉండడంతో జూలైలో రికార్డు స్థాయిలో కార్బన్‌ డయాౖMð్సడ్‌ విడుదలైంది. ఆయా దేశాల్లో 343 మెగాటన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలై వాతావరణాన్ని కలుషితం చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇటలీ, గ్రీస్, టర్కీలలో 5 లక్షల 68 వేల ఎకరాల అటవీ భూములు దగ్ధమయ్యాయని యూరోపియన్‌ ఫారెస్ట్‌ ఫైర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ తెలిపింది. 

కాలిఫోర్నియా చరిత్రలో మూడో అతి పెద్ద కార్చిచ్చు 
అమెరికాలోని కాలిఫోర్నియాలో రికార్డు స్థాయి ఎండలకు ఈదురు గాలులు తోడవడంతో కార్చిచ్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని డిక్సీలో 285 చదరపు కిలోమీటర్లు ఏర్పడిన కార్చిచ్చు ఒక్క రోజు కూడా గడవ కుండానే 1751 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఈ కార్చిచ్చుని అదుపులోనికి తేవడం అధికారులకు కూడా సవాల్‌గా మారింది. కా>లిఫోర్నియా చరిత్రలో మూడో అతి పెద్ద కార్చిచ్చు ఇదేనని అధికారులు చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top