ఆస్ట్రేలియా బీచ్‌లో ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి | Four Indians die in mass drowning at Australia Philip Island | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా బీచ్‌లో ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

Jan 26 2024 5:45 AM | Updated on Jan 26 2024 5:45 AM

Four Indians die in mass drowning at Australia Philip Island - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ బీచ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్‌ దీవిలోని ఎటువంటి కాపలా ఉండని ఈ బీచ్‌లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు చెప్పారు.

మృతులను జగ్జీత్‌ సింగ్‌ ఆనంద్‌(23), సుహానీ ఆనంద్‌(20), కీర్తి బేడి(20), రీమా సోంధి(43)గా గుర్తించారు. పంజాబ్‌కు చెందిన రీమా సోంధి రెండు వారాల క్రితం క్లైడ్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు ఫిలిప్‌ దీవికి వచ్చి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement