ఆనందంలో బోరిస్‌ జాన్సన్‌, తండ్రిగా మరోసారి ప్రమోషన్‌.. ఎనిమిదోసారి | Former UK PM Boris Johnson is expecting eighth child | Sakshi
Sakshi News home page

ఆనందంలో బోరిస్‌ జాన్సన్‌, తండ్రిగా మరోసారి ప్రమోషన్‌.. ఎనిమిదోసారి

May 21 2023 6:28 AM | Updated on May 21 2023 8:38 AM

Former UK PM Boris Johnson is expecting eighth child - Sakshi

లండన్‌: బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే ఏడుగురు పిల్లల తండ్రయిన ఆయన మరోసారి తండ్రి అవుతున్న ఆనందంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేరీ ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ లోకంలోకి రానున్న బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.

జాన్సన్‌ మూడో భార్య కేరీ.  మొదటి భార్యతో ఆయనకి పిల్లలు లేరు. రెండో భార్య వీలర్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కేరిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో మరో మహిళతోనూ జాన్సన్‌ అఫైర్‌ కొనసాగించడంతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటిదాకా జాన్సన్‌కు ఏడుగురు సంతానం ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement