breaking news
kerry
-
ఆనందంలో బోరిస్ జాన్సన్, తండ్రిగా మరోసారి ప్రమోషన్.. ఎనిమిదోసారి
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే ఏడుగురు పిల్లల తండ్రయిన ఆయన మరోసారి తండ్రి అవుతున్న ఆనందంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేరీ ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ లోకంలోకి రానున్న బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. జాన్సన్ మూడో భార్య కేరీ. మొదటి భార్యతో ఆయనకి పిల్లలు లేరు. రెండో భార్య వీలర్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కేరిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో మరో మహిళతోనూ జాన్సన్ అఫైర్ కొనసాగించడంతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటిదాకా జాన్సన్‌కు ఏడుగురు సంతానం ఉన్నారు. -
'అమెరికా ఆరోపణలు నిరాధారం'
టెహ్రాన్: మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ చర్యలను ఇరాన్ ప్రోత్సహిస్తోందన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరిఫ్ తోసిపుచ్చారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన జరిఫ్.. కెర్రీ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇరాన్‌పై కెర్రీ చేసిన వ్యాఖ్యలను ప్రపంచంలో ఎవరూ పరిగణలోకి తీసుకోరని జరిఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్య ప్రస్తుతం మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నది నిజమేనని అయితే దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఇరాక్ ప్రాంతంలో అమెరికా ఆక్రమణలకు పాల్పడటమే అని జరిఫ్ విమర్శించారు. కొన్ని దేశాలు తమ స్వల్పకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడం మూలంగానే ఇస్లామిక్ ఉగ్రవాద ప్రాభల్యం పెరుగుతోందని జరిఫ్ అన్నారు. గురువారం బహ్రెయిన్‌లో పర్యటించిన కెర్రీ మాట్లాడుతూ.. మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ పరిస్థితులకు ఇరాన్ కారణమని, ఆ దేశం తన పద్దతిని మార్చుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.